quranm◉

Surah Al-A'la transliteration

◉ సూరా · ∞

87:1

سَبِّحِ ٱسۡمَ رَبِّكَ ٱلۡأَعۡلَى ﴿1﴾

Transliteration: Sabbihi isma rabbika alaAAla

Translation: అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!

87:2

ٱلَّذِي خَلَقَ فَسَوَّىٰ ﴿2﴾

Transliteration: Allathee khalaqa fasawwa

Translation: ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.

87:3

وَٱلَّذِي قَدَّرَ فَهَدَىٰ ﴿3﴾

Transliteration: Waallathee qaddara fahada

Translation: మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు!

87:4

وَٱلَّذِيٓ أَخۡرَجَ ٱلۡمَرۡعَىٰ ﴿4﴾

Transliteration: Waallathee akhraja almarAAa

Translation: మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు.

87:5

فَجَعَلَهُۥ غُثَآءً أَحۡوَىٰ ﴿5﴾

Transliteration: FajaAAalahu ghuthaan ahwa

Translation: మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.

87:6

سَنُقۡرِئُكَ فَلَا تَنسَىٰٓ ﴿6﴾

Transliteration: Sanuqrioka fala tansa

Translation: మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు -

87:7

إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ إِنَّهُۥ يَعۡلَمُ ٱلۡجَهۡرَ وَمَا يَخۡفَىٰ ﴿7﴾

Transliteration: Illa ma shaa Allahu innahu yaAAlamu aljahra wama yakhfa

Translation: అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.

87:8

وَنُيَسِّرُكَ لِلۡيُسۡرَىٰ ﴿8﴾

Transliteration: Wanuyassiruka lilyusra

Translation: మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.

87:9

فَذَكِّرۡ إِن نَّفَعَتِ ٱلذِّكۡرَىٰ ﴿9﴾

Transliteration: Fathakkir in nafaAAati alththikra

Translation: కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు!

87:10

سَيَذَّكَّرُ مَن يَخۡشَىٰ ﴿10﴾

Transliteration: Sayaththakkaru man yakhsha

Translation: (అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు.

87:11

وَيَتَجَنَّبُهَا ٱلۡأَشۡقَى ﴿11﴾

Transliteration: Wayatajannabuha alashqa

Translation: మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు.

87:12

ٱلَّذِي يَصۡلَى ٱلنَّارَ ٱلۡكُبۡرَىٰ ﴿12﴾

Transliteration: Allathee yasla alnnara alkubra

Translation: అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు.

87:13

ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحۡيَىٰ ﴿13﴾

Transliteration: Thumma la yamootu feeha wala yahya

Translation: అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు.

87:14

قَدۡ أَفۡلَحَ مَن تَزَكَّىٰ ﴿14﴾

Transliteration: Qad aflaha man tazakka

Translation: సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు.

87:15

وَذَكَرَ ٱسۡمَ رَبِّهِۦ فَصَلَّىٰ ﴿15﴾

Transliteration: Wathakara isma rabbihi fasalla

Translation: మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు.

87:16

بَلۡ تُؤۡثِرُونَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا ﴿16﴾

Transliteration: Bal tuthiroona alhayata alddunya

Translation: అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు;

87:17

وَٱلۡأٓخِرَةُ خَيۡرٞ وَأَبۡقَىٰٓ ﴿17﴾

Transliteration: Waalakhiratu khayrun waabqa

Translation: కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది.

87:18

إِنَّ هَٰذَا لَفِي ٱلصُّحُفِ ٱلۡأُولَىٰ ﴿18﴾

Transliteration: Inna hatha lafee alssuhufi aloola

Translation: నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది;

87:19

صُحُفِ إِبۡرَٰهِيمَ وَمُوسَىٰ ﴿19﴾

Transliteration: Suhufi ibraheema wamoosa

Translation: ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.

Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download