quranm◉

Surah Al-'Alaq transliteration

◉ సూరా · ∞

96:1

ٱقۡرَأۡ بِٱسۡمِ رَبِّكَ ٱلَّذِي خَلَقَ ﴿1﴾

Transliteration: Iqra biismi rabbika allathee khalaqa

Translation: చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు!

96:2

خَلَقَ ٱلۡإِنسَٰنَ مِنۡ عَلَقٍ ﴿2﴾

Transliteration: Khalaqa alinsana min AAalaqin

Translation: ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు.

96:3

ٱقۡرَأۡ وَرَبُّكَ ٱلۡأَكۡرَمُ ﴿3﴾

Transliteration: Iqra warabbuka alakramu

Translation: చదువు! మరియు నీ ప్రభువు పరమదాత.

96:4

ٱلَّذِي عَلَّمَ بِٱلۡقَلَمِ ﴿4﴾

Transliteration: Allathee AAallama bialqalami

Translation: ఆయన కలం ద్వారా నేర్పాడు.

96:5

عَلَّمَ ٱلۡإِنسَٰنَ مَا لَمۡ يَعۡلَمۡ ﴿5﴾

Transliteration: AAallama alinsana ma lam yaAAlam

Translation: మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.

96:6

كَلَّآ إِنَّ ٱلۡإِنسَٰنَ لَيَطۡغَىٰٓ ﴿6﴾

Transliteration: Kalla inna alinsana layatgha

Translation: అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు.

96:7

أَن رَّءَاهُ ٱسۡتَغۡنَىٰٓ ﴿7﴾

Transliteration: An raahu istaghna

Translation: ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు.

96:8

إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجۡعَىٰٓ ﴿8﴾

Transliteration: Inna ila rabbika alrrujAAa

Translation: నిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.

96:9

أَرَءَيۡتَ ٱلَّذِي يَنۡهَىٰ ﴿9﴾

Transliteration: Araayta allathee yanha

Translation: నీవు నిరోధించే వ్యక్తిని చూశావా?

96:10

عَبۡدًا إِذَا صَلَّىٰٓ ﴿10﴾

Transliteration: AAabdan itha salla

Translation: నమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి?

96:11

أَرَءَيۡتَ إِن كَانَ عَلَى ٱلۡهُدَىٰٓ ﴿11﴾

Transliteration: Araayta in kana AAala alhuda

Translation: ఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి?

96:12

أَوۡ أَمَرَ بِٱلتَّقۡوَىٰٓ ﴿12﴾

Transliteration: Aw amara bialttaqwa

Translation: ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే?

96:13

أَرَءَيۡتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ ﴿13﴾

Transliteration: Araayta in kaththaba watawalla

Translation: ఒకవేళ (ఆ నిరోధించే) వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే?

96:14

أَلَمۡ يَعۡلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ ﴿14﴾

Transliteration: Alam yaAAlam bianna Allaha yara

Translation: వాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా?

96:15

كَلَّا لَئِن لَّمۡ يَنتَهِ لَنَسۡفَعَۢا بِٱلنَّاصِيَةِ ﴿15﴾

Transliteration: Kalla lain lam yantahi lanasfaAAan bialnnasiyati

Translation: అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము.

96:16

نَاصِيَةٖ كَٰذِبَةٍ خَاطِئَةٖ ﴿16﴾

Transliteration: Nasiyatin kathibatin khatiatin

Translation: అది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు!

96:17

فَلۡيَدۡعُ نَادِيَهُۥ ﴿17﴾

Transliteration: FalyadAAu nadiyahu

Translation: అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను!

96:18

سَنَدۡعُ ٱلزَّبَانِيَةَ ﴿18﴾

Transliteration: SanadAAu alzzabaniyata

Translation: మేము కూడా నరక దూతలను పిలుస్తాము!

96:19

كَلَّا لَا تُطِعۡهُ وَٱسۡجُدۡۤ وَٱقۡتَرِب۩ ﴿19﴾

Transliteration: Kalla la tutiAAhu waosjud waiqtarib

Translation: అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు!

Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download