quranm◉

Surah At-Tariq transliteration

◉ సూరా · ∞

86:1

وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ ﴿1﴾

Transliteration: Waalssamai waalttariqi

Translation: ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా!

86:2

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلطَّارِقُ ﴿2﴾

Transliteration: Wama adraka ma alttariqu

Translation: రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది?

86:3

ٱلنَّجۡمُ ٱلثَّاقِبُ ﴿3﴾

Transliteration: Alnnajmu alththaqibu

Translation: అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం.

86:4

إِن كُلُّ نَفۡسٖ لَّمَّا عَلَيۡهَا حَافِظٞ ﴿4﴾

Transliteration: In kullu nafsin lamma AAalayha hafithun

Translation: కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు.

86:5

فَلۡيَنظُرِ ٱلۡإِنسَٰنُ مِمَّ خُلِقَ ﴿5﴾

Transliteration: Falyanthuri alinsanu mimma khuliqa

Translation: కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి!

86:6

خُلِقَ مِن مَّآءٖ دَافِقٖ ﴿6﴾

Transliteration: Khuliqa min main dafiqin

Translation: అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు.

86:7

يَخۡرُجُ مِنۢ بَيۡنِ ٱلصُّلۡبِ وَٱلتَّرَآئِبِ ﴿7﴾

Transliteration: Yakhruju min bayni alssulbi waalttaraibi

Translation: అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది.

86:8

إِنَّهُۥ عَلَىٰ رَجۡعِهِۦ لَقَادِرٞ ﴿8﴾

Transliteration: Innahu AAala rajAAihi laqadirun

Translation: నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు!

86:9

يَوۡمَ تُبۡلَى ٱلسَّرَآئِرُ ﴿9﴾

Transliteration: Yawma tubla alssarairu

Translation: ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో!

86:10

فَمَا لَهُۥ مِن قُوَّةٖ وَلَا نَاصِرٖ ﴿10﴾

Transliteration: Fama lahu min quwwatin wala nasirin

Translation: అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు.

86:11

وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجۡعِ ﴿11﴾

Transliteration: Waalssamai thati alrrajAAi

Translation: వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా!

86:12

وَٱلۡأَرۡضِ ذَاتِ ٱلصَّدۡعِ ﴿12﴾

Transliteration: Waalardi thati alssadAAi

Translation: (చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా!

86:13

إِنَّهُۥ لَقَوۡلٞ فَصۡلٞ ﴿13﴾

Transliteration: Innahu laqawlun faslun

Translation: నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి).

86:14

وَمَا هُوَ بِٱلۡهَزۡلِ ﴿14﴾

Transliteration: Wama huwa bialhazli

Translation: మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు.

86:15

إِنَّهُمۡ يَكِيدُونَ كَيۡدٗا ﴿15﴾

Transliteration: Innahum yakeedoona kaydan

Translation: (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు.

86:16

وَأَكِيدُ كَيۡدٗا ﴿16﴾

Transliteration: Waakeedu kaydan

Translation: మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను.

86:17

فَمَهِّلِ ٱلۡكَٰفِرِينَ أَمۡهِلۡهُمۡ رُوَيۡدَۢا ﴿17﴾

Transliteration: Famahhili alkafireena amhilhum ruwaydan

Translation: కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధి నివ్వు! వారి పట్ల మృదువుగా వ్యవహరించు.

Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download