quranm◉

Surah Al-Balad transliteration

◉ సూరా · ∞

90:1

لَآ أُقۡسِمُ بِهَٰذَا ٱلۡبَلَدِ ﴿1﴾

Transliteration: La oqsimu bihatha albaladi

Translation: కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)!

90:2

وَأَنتَ حِلُّۢ بِهَٰذَا ٱلۡبَلَدِ ﴿2﴾

Transliteration: Waanta hillun bihatha albaladi

Translation: మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.

90:3

وَوَالِدٖ وَمَا وَلَدَ ﴿3﴾

Transliteration: Wawalidin wama walada

Translation: మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా!

90:4

لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِي كَبَدٍ ﴿4﴾

Transliteration: Laqad khalaqna alinsana fee kabadin

Translation: వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము.

90:5

أَيَحۡسَبُ أَن لَّن يَقۡدِرَ عَلَيۡهِ أَحَدٞ ﴿5﴾

Transliteration: Ayahsabu an lan yaqdira AAalayhi ahadun

Translation: ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా?

90:6

يَقُولُ أَهۡلَكۡتُ مَالٗا لُّبَدًا ﴿6﴾

Transliteration: Yaqoolu ahlaktu malan lubadan

Translation: అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు.

90:7

أَيَحۡسَبُ أَن لَّمۡ يَرَهُۥٓ أَحَدٌ ﴿7﴾

Transliteration: Ayahsabu an lam yarahu ahadun

Translation: ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా?

90:8

أَلَمۡ نَجۡعَل لَّهُۥ عَيۡنَيۡنِ ﴿8﴾

Transliteration: Alam najAAal lahu AAaynayni

Translation: ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా?

90:9

وَلِسَانٗا وَشَفَتَيۡنِ ﴿9﴾

Transliteration: Walisanan washafatayni

Translation: మరియు నాలుకను మరియు రెండు పెదవులను.

90:10

وَهَدَيۡنَٰهُ ٱلنَّجۡدَيۡنِ ﴿10﴾

Transliteration: Wahadaynahu alnnajdayni

Translation: మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.

90:11

فَلَا ٱقۡتَحَمَ ٱلۡعَقَبَةَ ﴿11﴾

Transliteration: Fala iqtahama alAAaqabata

Translation: కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు!

90:12

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡعَقَبَةُ ﴿12﴾

Transliteration: Wama adraka ma alAAaqabatu

Translation: మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా?

90:13

فَكُّ رَقَبَةٍ ﴿13﴾

Transliteration: Fakku raqabatin

Translation: అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం.

90:14

أَوۡ إِطۡعَٰمٞ فِي يَوۡمٖ ذِي مَسۡغَبَةٖ ﴿14﴾

Transliteration: Aw itAAamun fee yawmin thee masghabatin

Translation: లేదా! (స్వయంగా) ఆకలి గొని ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.

90:15

يَتِيمٗا ذَا مَقۡرَبَةٍ ﴿15﴾

Transliteration: Yateeman tha maqrabatin

Translation: సమీప అనాథునికి గానీ;

90:16

أَوۡ مِسۡكِينٗا ذَا مَتۡرَبَةٖ ﴿16﴾

Transliteration: Aw miskeenan tha matrabatin

Translation: లేక, దిక్కులేని నిరుపేదకు గానీ!

90:17

ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ وَتَوَاصَوۡاْ بِٱلۡمَرۡحَمَةِ ﴿17﴾

Transliteration: Thumma kana mina allatheena amanoo watawasaw bialssabri watawasaw bialmarhamati

Translation: మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం.

90:18

أُوْلَـٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ ﴿18﴾

Transliteration: Olaika ashabu almaymanati

Translation: ఇలాంటి వారే కుడిపక్షం వారు.

90:19

وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِنَا هُمۡ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ ﴿19﴾

Transliteration: Waallatheena kafaroo biayatina hum ashabu almashamati

Translation: ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు.

90:20

عَلَيۡهِمۡ نَارٞ مُّؤۡصَدَةُۢ ﴿20﴾

Transliteration: AAalayhim narun musadatun

Translation: వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది.

Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download